ప్రాణాలు పణంగా పెట్టిన అసిస్టెంట్ లైన్మెన్ శంకర్

తిరుమలగిరి సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలమవుతుంది.తిరుమలగిరి మండలంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.ఓవైపు భారీ వర్షాలు పైగా ఆదివారం కావడంతో చాలామంది ప్రజలు ఇళ్లలోనే ఉన్నారు.మరోవైపు విద్యుత్ సిబ్బంది మాత్రం భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా మరమ్మతుల్లో నిమగ్నమయ్యారు.తిరుమలగిరి మండలం జలాలిపురం గ్రామంలోని ప్రాణాలు పణంగా పెట్టి విద్యుత్ అంతరాయాన్ని తొలగించిన అసిస్టెంట్ లైన్మెన్ శంకర్ 11 కెవి ఫీడర్లు ఇన్స్టిలేషన్ రిప్లై చేశారు.బ్రేక్ డౌన్ క్లియర్ చేసిన విద్యుత్ సిబ్బంది.కరెంటు పోతే వాళ్లను తిట్టుకునే మనం ఇలాంటి సమయంలో వారి శ్రమను గుర్తించాల్సిందేనని పలువురు చర్చించుకుంటున్నారు. విద్యుత్ సిబ్బందిని మండల ఏ ఈ అభినందించారు