దళిత ఎమ్మెల్యేను అవమానించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి వేముల పవన్

తిరుమలగిరి 02 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో శుక్రవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ వద్దకు ఎమ్మెల్యే వేముల వీరేశం మంత్రులకు స్వాగతం పలికేందుకు చేరుకోగా అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు అనుమతి లేదంటూ నిరాకరించడాన్ని యూత్ కాంగ్రెస్ నాయకులు వేముల పవన్ ఖండించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన వేముల వీరేశమును అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించడాన్ని తీవ్రంగా ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందని, వీధుల్లో ఉన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు.