బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ లో చేరిక..
నిజామాబాద్ మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం, 20 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ లో చేరిక..
తెలంగాణవార్త మార్చ్ 29 నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలోని మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం తో పాటు 20 మంది కార్పొరేటర్ ను బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ స్వగృహం లో సభ్యులకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు తేజస్విని శ్రీనివాస్ రెడ్డి,అంత రెడ్డి లతా దేవేందర్ రెడ్డి,గంగమణి నరేంద్ర గౌడ్,గోపు సుగుణ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.