జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు
వస్కుల మట్టయ్య

మిర్యాలగూడ, 5 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- మిర్యాలగూడ పట్టణంలో రామచంద్ర గూడెం Y జంక్షన్లో ఉన్న జగ్జీవన్ రామ్ 117 వ జయంతి సందర్భంగా దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వస్కుల మట్టయ్య అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా దళిత సంఘాల నేతలు నాయకులు మాట్లాడుతూ దళిత హక్కుల పోరాట యోధుడు అన్నారు అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళితుల చిహ్నం జగ్జీవన్ రామ్ అన్నారు జగ్జీవన్ రామ్ జన్మదిన భారతదేశమంతటా దళిత బహుజనులు జరుపుకుంటున్నారని పాఠశాల విద్య కొనసాగుతున్నప్పుడు ఆయన మొదటిసారి వివక్షతను ఎదుర్కొన్నారని విశ్వవిద్యాలయంలో కూడా జగ్జీవన్ రామ్ వివక్షను ఎదుర్కొన్నారని సమాజంలో ఒక వర్గం పై జరుగుతున్న సామాజిక బహిష్కరణకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి ఆయనకు ప్రేరేపన వచ్చిందన్నారు అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన తెలుపడానికి షెడ్యూల్డ్ కులాలను ఆయన సంఘటితం చేసినారని అన్నారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలలో జగ్జీవన్ రావు ఉత్సాహంగా పాల్గొనేవారు అని సామాజిక సమానత్వంపై అందరిని చైతన్య పరిచినారు బీహార్ రాష్ట్రంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన జగ్జీవన్ రావునేడు మన దేశానికి ఆదర్శ నాయకుడిగా ప్రతి సంవత్సరం తలుచుకుంటున్నామని ఆయన అడుగుజాడల్లో దళిత బహుజనలంతా పోరాటాల రావాలని పిలుపునిచ్చినారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజు, ముండ్లగిరి కాంతయ్య ,ఉబ్బపల్లి కాశయ్య, తలకొప్పుల సైదులు, మచ్చ ఏడుకొండలు, మిర్యాలగూడ బి ఎస్ పి నియోజకవర్గ అధ్యక్షులు
పుట్టల దినేష్, మల్లయ్య, దైద శ్రీను, బొప్పాని నాగేష్, తిరుమలగిరి అంజి, నల్లగంతుల నాగభూషణం, మడుపు శ్రీను, మాడుగుల శ్రీను వస్కుల భరత్, గూడపూరి శ్రీనివాస్, జయరాజు పోతుగంటి, కాశి, రెమడల క్రాంతి ,ఈశ్వర చారి ,రవీందర్ నాయక్, మల్లేష్ , రవీందర్, దైద రవి, మోహన్ నాయక్, కార్తీక్, కిరణ్, వెంకన్న, వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.