ఇది చంద్రబాబు మార్క గవర్నమెంట్
ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి : ఇది చంద్రబాబు మార్క్ గవర్నమెంట్ ప్రపంచంలో ఏ మూలన ఏం జరుగుతుంది అనేది సెకండ్ల వ్యవధిలో ఎక్కడ ఉన్నా స్మార్ట్ ఫోన్ ద్వారా ఎక్కడ ఉన్నా తెలుసుకోగలుగుతున్నాం..
కానీ ఇంకా కొన్ని పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం తప్పడం లేదు వీటి అన్నిటికీ చెక్ పెడుతూ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఈ వాట్సాప్ గవర్నెన్స్.
ప్రస్తుతం వాట్సాప్ వాడటం రాని వాళ్ళు చాల తక్కువ పెద్ద వయసు వాళ్ళు కూడా వాట్సాప్ ద్వారా విదేశాల్లో ఉన్న తమ పిల్లలతో వీడియో కాల్స్ మాట్లాడుతున్నారు.
ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా విద్యార్థులకు ద్రువ పత్రాల మంజూరు, పెద్దలకు దైవ దర్శనాలు, ఆర్టీసీ టికెట్ల బుకింగ్, రైతులకు పొలం కాగితాలు, ఇవన్నీ ఆన్లైన్ లో అప్లై చేసుకోవడం వలన కార్యాలయాల చుట్టూ తిరిగే సమయం ఆదా అవ్వడమే కాకుండా అవినీతి కూడా తగ్గుతుంది.