పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
సూర్యపేట, 19 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– ఆర్.కె.ఎల్.కె డిగ్రీ కళాశాలలో 30 సంవత్సరాల క్రితం డిగ్రీ పూర్తి చేసిన తెలుగు మీడియం విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా 30 సంవత్సరాల గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిపారు కళాశాలలో గడిపిన ఆనాటి రోజులను తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపారు వివిధ హోదాలో స్థిరపడిన విద్యార్థులు విద్యార్థినిలు ఆదివారం కలుసుకొని ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థినీ విద్యార్థులు కారింగుల శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, అజిత్, గిరి, ఉష, సుష్మ, గురునాథం, శ్రీధర్, నరసింహారావు, శంకర్, రఘు, సుధీర్, రవి, రమేష్, సునీత, శశికళ, విద్య, రజిత, విజయ తదితరులు పాల్గొన్నారు.