రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు!

Apr 4, 2025 - 23:33
Apr 4, 2025 - 23:37
 0  0
రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు!

మద్దిరాల 05 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలో రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించడం జరిగింది.మండల కేంద్రంలో మద్దిరాల శుక్రవారం రోజు తాసిల్దార్ కార్యాలయం ముందు రేషన్ డీలర్ల అధ్యక్షుడు తాళ్లపెళ్లి మల్లేష్ అధ్యక్షతన చలివేంద్రం ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక తహసిల్దార్ ఆమీన్ సింగ్ రిబ్బన కట్ చేసి ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..వేసవిలో ప్రజల దాహాన్ని తీర్చేందుకు రేషన్ డీలర్లు చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల రేషన్ డీలర్లను అభినందించారు.చలివేంద్రంలో నీటిని వృధా చేయకుండా ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో దుగ్యాల వెంకటేశ్వరరావు,తీగల వెంకన్న, పొన్నాల పద్మయ్య చెన్నోజు లింగాచారి రాజేశ్వరరావు బాణాల ఇందిర, రాంపాక సత్తయ్య, మీసాల పరశురాములు, వెలుగు అంజయ్య, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.