ధరలు తగ్గించి రైతుల కన్నీళ్లను పెట్టిస్తున్న రైస్ మిల్లర్లు

హుజూర్ నగర్ 05 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
ది హుజూర్నగర్, మిర్యాలగూడ రైస్ మిల్లర్లు సిండికేట్ ఐ రైతుల కష్టాలని దోచుకుంటున్నా రైస్ మిల్లు మబ్బులు పట్టి ఒక్క చినుకు వర్షం పడకపోయినా రేటును తగ్గించేసారు. ఇష్ట రాజ్యాంగా రైతుల కష్టాలను దోచుకుంటుర్రు. కలెక్టర్ గారు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు, రాజకీయ నాయకులు ఇలాంటి సమయంలో రైతు పక్షాన నిలబడాలి . అలా కాకుండా మీరు కూడా వారి ప్రలోభలకు లుంగీ రైతుల కన్నీళ్లను కారణం కావొద్దు. సినిమా వాళ్లకే సినిమా టికెట్లు ఇష్టం వచ్చినంత రేటు పెంచుకోమనేసి పెంచేస్తున్నారు. కానీ మన దేశం రైతే రాజ్యం అనేసి గొప్పగా చెప్పుకుంటున్నరు రైతుల పండించిన పంటకు మాత్రం గిట్టుబాటు ధర మాత్రం సమయానికి అందించరు. మేము రైతులు బాధపడుకుంటూ పంటనీ అమ్మి పరిస్థితి ఏర్పడుతుంది రైస్ మిల్లర్లు ఒక్కసారి ఆలోచించండి కాలుష్యాన్ని పీల్చుకుంటున్నది రైతులే, మిల్లు నుంచి వచ్చే వ్యర్ధాలను, బూడిదలను అన్ని భరిస్తున్నాము గిట్టుబాటు ధర ఇవ్వకుండా సిండికేట్ కోట్ల డబ్బులు కూడా పెట్టుకుంటారు. ఇలాంటి సమయంలో కలెక్ట గారు రైతులు పక్షం నిలబడాలని డిమాండ్ చేస్తున్న *ఓ రైతు లీలావతి చీకూరి గోపాలపురం.*