సీఎంఆర్ఎఫ్ నిధులు నిరుపేదలకు వరం ఎమ్మెల్యే మందుల సామెల్

తిరుమలగిరి 05 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకు వరం లాంటిదని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ అన్నారు శనివారం నాడు తిరుమలగిరి మున్సిపల్ పరిధిలోని శుభమస్తు ఫంక్షన్ హాల్ లో జరిగిన నియోజకవర్గ ముఖ్యమంత్రి సహాయనిధి పథకం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా తుంగతుర్తి నియోజకవర్గం లో ఎంతోమంది నిరుపేదలకు వరంగా మారిందని అన్నారు గత పాలకుల నిర్లక్ష్యమూలంగా నియోజకవర్గంలో పాటు రాష్ట్రంలో సీఎం ఆర్ ఎఫ్ పథకం నిరుపయోగంగా మారిందని అన్నారు. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యం లో జరుగుతున్న ప్రజాపాలన ప్రభుత్వంలో గ్రామస్థాయిలో ఉన్న లబ్ది దారులకు తాము పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఎందరో వివిధ కారణాలవల్ల ఇబ్బందులకు గురవుతున్న వారికి ఈ పథకాన్ని అందజేస్తున్నామని చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం దిగ్విజయంగా కొనసాగుతుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ లతో తో పాటు అన్ని పథకాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందని అని చెప్పారు రైతులకు గిట్టుబాటు ధరతో పాటు రుణమాఫీ బోనస్ లాంటి పథకాలను అమలు చేశారని అని చెప్పారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని అన్నారు రైతాంగం సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని అని చెప్పారు రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ అందజేస్తామని ఆయన అన్నారు ఇప్పటికే నాలుగు ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా సహాయం అందజేశామని అని చెప్పారు రైతాంగం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తోపాటు జిల్లా మంత్రుల సహకారంతో తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారని అని చెప్పారు తాను ఇప్పటివరకు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో సిసి రోడ్లు మంచినీటి ట్యాంకులు పాఠశాల భవనాలు రోడ్లు మంజూరు చేయించానని అని చెప్పారు రైతుల పంటలు ఎండిపోకూడదని ఉద్దేశంతో గోదావరి జలాలను నిరంతరంగా పంపిణీ చేస్తున్నానని అని చెప్పారు రైతులకు ఈ సీజన్లో గ్రామాల్లో గిట్టుబాటు ధర కల్పన కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అని చెప్పారు రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని అని చెప్పారు.ఈ కార్యక్రమానికీ ముందుగా *బాబు జగ్జీవన్ రావు జయంతి* పురస్కరించుకుని శాసనసభ్యులు మందుల సామెల్ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో
వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఎల్సోజు చామంతి నరేష్, పిఎసిఎస్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్, డిప్యూటీ తహసిల్దార్ జాన్ మహమ్మద్, మండల పార్టీ అధ్యక్షులు ఎల్సోజు నరేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జుమ్మిలాల్ నాయక్, పట్టణ అధ్యక్షులు పేరాల వీరేష్,జిల్లా నాయకులు సుంకరి జనార్ధన్, జిల్లా యువజన నాయకులు కందుకూరి అంబేద్కర్, కందుకూరి లక్ష్మయ్య, మాజీ కౌన్సిలర్లు గుగులోతు భాస్కర్ నాయక్, బత్తుల శ్రీను, రాము గౌడ్, కిష్ట నాయక్, ఎస్టీ సెల్ అధ్యక్షులు ప్రేమప్రసాద్, రామోజీ, నాయిని కృష్ణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.