యజ్ఞయాగాదుల వల్ల సకాలంలో వర్షాలు
జోగులాంబ గద్వాల 5 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:- యజ్ఞ యాగాదులు చేయడం వల్ల సకాలంలో వర్షాలు కురిసి పంటలు సుబిక్షంగా పండుతాయని రుత్వికులు తెలిపారు. మల్దకల్ మండల పరిధిలోని ఎల్కూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ ఆంజనేయ లక్ష్మణ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో శనివారం రెండవ రోజు గణపతి హోమం, బ్రహ్మాది మండల హోమం, యోగిని మండల హోమం, వాస్తు మండల హోమం, పాలికా మండల హోమం, నవగ్రహ హోమం, ఆవాహిక దేవత మూలమంత్ర హోమ, హవన పవమాన హోమం, జపా క్షీరతర్పణ, మంగళహారతి తీర్థప్రసాద కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం విగ్రహాలకు ధాన్యాధివాసం, సెయ్యాది వాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు రమేష్ చారి, శశాంక దాస్, ప్రసన్న ,నరేష్, ప్రాణేష్, రాఘవేంద్ర దాస్, గ్రామస్తులు నాగేష్, చక్రధర్ రెడ్డి దంపతులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.