పవన్, చంద్రబాబు… ఆ బాండింగే వేరు

Feb 16, 2025 - 14:51
Feb 16, 2025 - 16:18
 0  18
పవన్, చంద్రబాబు… ఆ బాండింగే వేరు

పవన్ కల్యాణ్ తో మాట్లాడేందుకు ప్రయత్నించాను కానీ అందుబాటులోకి రాలేదని .. నాదెండ్ల మనోహర్ తో చంద్రబాబు అన్న ఒక్క మాట.. వైసీపీతో పాటు.. ఇతర వ్యతిరేకుల్లో చాలా ఆశలు నింపింది. ఏదో జరిగిపోతుందని తమకు మళ్లీ మంచి రోజులు వస్తాయని వారు ఓపిక తెచ్చుకుని కొంత రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. కానీ పవన్ కల్యాణ్ ఒక సాయంత్రం వారి ఆశల్ని అడియాసలు చేశారు. దాంతో ఇప్పుడు వర్కౌట్ అవలేదని మళ్లీ రెస్టు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పవన్, చంద్రబాబు కలిసి కనిపిస్తే పీడకలలే

చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి కనిపిస్తే ఏపీ రాజకీయాల్లో కొంత మందికి పీడకలలు వస్తాయి. తమ పరిస్థితి ఏమిటా అని మథనపడిపోతారు. అందుకే వారిద్దరూ ఎప్పటికప్పుడు విడిపోయారని ప్రచారం చేసుకోవడానికి కిందా మీదా పడుతూ ఉంటారు. ప్రభుత్వంలో.. పార్టీలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా హైలెట్ చేసుకుని వారి మధ్య గొడవలు వచ్చాయోచ్ అని సంబర పడుతూ ఉంటారు. కానీ ఇవేమీ పట్టించుకోని చంద్రబాబు , పవన్ సందర్భం కలసి వచ్చినప్పుడు ఉల్లాసంగా,ఉత్సాహంగా గడిపేస్తూంటారు.

కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉండకుండా కూటమి జాగ్రత్తలు

కూటమిలో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉండకుండా కూటమి నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైసీపీకి.. ఆ పార్టీ సానుభూతిపరుల మీడియాకు ఒకటే టార్గెట్.. చంద్రబాబు, పవన్ లను దూరం చేయడం. వారి గురించి తెలుసు కాబట్టి వారు చేసే ప్రచారాన్ని పూర్తి స్థాయిలో లైట్ తీసుకుంటున్నారు. కింది స్థాయి క్యాడర్ కూడా అదే చేసేలా సంకేతాలు ఇస్తున్నారు. తమ మధ్య ఎప్పుడూ గ్యాప్ లేదని నిరూపించే ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు.

బాబు, పవన్ బాండింగ్ రాజకీయాలకు అతీతం

పవన్ కల్యాణ్ .. చంద్రబాబు మధ్య ఉన్న బాండింగ్ రాజకీయాలకు అతీతంగా కనికనిపిస్తోంది. వ్యక్తిగతంగానూ మంచి మిత్రులుగా కనిపిస్తున్నారు. బహిరంగ కార్యక్రమాల్లో వీరు మాట్లాడుకునే విధానం అలాగే ఉంటుంది. రాజకీయాల్లో కలసి పోటీ. చేసినప్పుడు.. పొత్తుల్లో ఉన్నప్పుడు వచ్చే చిన్న చిన్న సమస్యలను ఇలాంటి బాండింగ్ ద్వారా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అది కూటమి పటిష్టతకు మరింతగా ఉపయోగపడుతుంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333