సంతలో ట్రాఫిక్ నిబంధన పాటించాలి ఎస్సై వెంకటేశ్వర్లు

తిరుమలగిరి 20 మార్చి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో సూర్యాపేట జనగాం జాతీయ రహదారి ప్రక్కన ప్రతి బుధవారం జరిగే వార సంత జరుగు ప్రదేశాన్ని మున్సిపాలిటీ కమిషనర్ మరియు ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ వార సంతలో నిర్వహించు చిరు వ్యాపారులతో మాట్లాడి, రోడ్డుపై వ్యాపారం నిర్వహిస్తున్న వారి వలన రోడ్డు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున మరియు వారి వద్దకు వచ్చే సామాన్య ప్రజలకు కూడా రోడ్డు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున వారితో మాట్లాడి మున్సిపాలిటీ వారు ఇచ్చిన స్థలాలలో వ్యాపారం నిర్వహించుకుని ఏలాంటి రోడ్డు ప్రమాదాలు మరియు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని మరియు సంతలో వ్యాపార నిర్వహించే వారు కూడా సహకరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు