**ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరు""ఎమ్మెల్యే శ్రీ శ్రీ రామ్ తాతయ్య*

ఒక కోటి, మూడు లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు...... ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
పేదలను అన్ని రకాలుగా ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం....... ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
జగ్గయ్యపేట 23 మార్చ్ 2025 తెలంగాణవార్త ప్రతినిధి. నియోజకవర్గంలో వైద్యం చేయించుకున్న బిల్లులు ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య దృష్టికి తీసుకొని రాగా, వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకుని వెళ్లి వెంటనే 175 మంది లబ్ధిదారులకు ఒక కోటి మూడు లక్షల రూపాయల C.M.R.F నిధులు మంజూరు చేయడం జరిగినది.
ఈరోజు జగ్గయ్యపేట మండలంలో 47 మంది లబ్ధిదారులకు 19 లక్షల, 87 వేల రూపాయలు, 600 రూపాయలు C.M.R.F చెక్కులు మండలంలోని వివిధ గ్రామాలలో లబ్ధిదారుని ఇళ్ల వద్దకు వెళ్లి వారికి పంపిణీ చేయడం జరిగినది._
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ.అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకున్న పేద,బడుగు,బలహీన వర్గాల ప్రజలకు సీ.ఎం.ఆర్.ఎఫ్ పథకం కొండంత అండ అని, నిరుపేద ప్రజలు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకొని ఆ బిల్లులను ముఖ్యమంత్రి సహాయనిధి పథకానికి పెట్టుకుంటే నెల రోజుల్లోనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ డబ్బులను తిరిగి చెక్కుల రూపంలో ఇవ్వడం జరుగుతుందని, పేదలను అన్ని రకాలుగా ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అన్నారు. లబ్ధిదారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య కృతజ్ఞతలు తెలిపారు._
_ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు గారు మరియు వివిధ హోదాలలో ఉన్న ఆయా గ్రామాల తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు._