ప్రజలకు ,మేధావులకు ప్రజా నేస్తం అవార్డు గ్రహీత కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ బహిరంగ లేఖ...!

తెలంగాణ వార్త రిపోర్టర్ ప్రజలకు ,మేధావులకు
కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ బహిరంగ లేఖ...!
చంపాల్సింది నక్సలైట్లను కాదు...
అసమానతల దోపిడి వ్యవస్థను...! మేధావులారా ఇకనైనా మౌనం వీడండి...!!
మోడీ అమిత్ షా కు దమ్ముంటే... దేశంలో పేదరికం చంపండి... పేదలు, ధనికులు తేడాలు లేని నూతన సమాజాన్ని సృష్టించండి...!
కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు డిమాండ్
.........
నేటి నక్సలైట్లు చనిపోతారు.
నేటి పోలీసులు కూడా చనిపోతారు.
కానీ మళ్ళీ కొత్తగా కొంతమంది నక్సలైట్లు అవుతారు
కొందరు పేదవాళ్ళు పోలీసులుగా మళ్ళీ తయారవుతారు.
ఈ పోరాటం కొనసాగుతూ ఉంటుంది.
కాబట్టి ఈ పోరాటాన్ని అర్థం చేసుకోండి.
అందులో మీ పాత్రను గుర్తించండి.
ఈరోజే దీనిలో జోక్యం చేసుకోండి.
లేకపోతే, మీ పిల్లలు భరించాల్సి వస్తుంది.
నేటి పేదలు చనిపోతారు.
ధనవంతులు కూడా చనిపోతారు.
నేటి అవినీతిపరులైన నాయకులు కూడా చనిపోతారు.
కానీ పుట్టుకతోనే ఒక వ్యక్తిని ధనవంతుడిగా, పేదవాడిగా, అవినీతిపరుడిగా చేసే క్రూరమైన వ్యవస్థ మిగిలిపోతుంది.
కాబట్టి మన ప్రయత్నాలన్నీ ఈ వ్యవస్థనే మార్చడానికి చేయాలనీ..... బాధితుల బంధువు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ ప్రధాన కార్యదర్శి ప్రజా నేస్తం అవార్డు గ్రహీత
కామ్రేడ్ జే కే ఆర్ గారి
జె ఎస్ ఆర్ సార్
నేడు ప్రజలకు ప్రజాస్వామిక వాదులకు రాసిన బహిరంగ లేఖలో విజ్ఞప్తి చేశారు....
సమస్త ప్రకృతి వనరులను, పంచభూతాలను , కోట్లాది ప్రజల ఆస్తులను శ్రమజీవుల భూమిని, నీటిని, అడవులను, కష్టార్జితాన్ని తుపాకీతో లాక్కొని అభివృద్ధి చేయడమే మన దేశ పాలకులకు దోపిడీ రాజకీయ పార్టీల నాయకులకు, దోపిడీ సమాజాన్ని సమర్థించే కుహనా అభివృద్ధి నిరోధక మేధావులకు దొంగ ప్రజాస్వామిక వాదులకు తెలుసు.
పాలకులు అభివృద్ధి నిరోధకులు దోపిడీ వ్యవస్థ సమర్థకులు నిరంతరం జపించే
ఈ అభివృద్ధి నిరంతరం హింసను సృష్టిస్తుంది.
ఈ అభివృద్ధిని నిలబెట్టుకోవడానికి మనకు చాలా హింస అవసరం అవుతుంది.
మనం సృష్టించే హింస మనపైనే తిరగబడినప్పుడు
మనం మర్యాదస్తుల్లాగా మతం, నైతికత, ప్రజాస్వామ్యం వంటి డొల్ల పదాల వెనుక ఆశ్రయం పొందడానికి విఫలయత్నం చేస్తాం.
కానీ మన ఈ నటన ఎంతో కాలం సాగదనీ... కార్మిక వర్గ బోర పుత్రుడు... శ్రామిక వర్గ రాజ్యాధికార స్వప్నికుడు... హరిజన గిరిజన బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం తపిస్తున్న నిరుపేద గొర్రెల కాపరి కుటుంబానికి చెందిన కమ్యూనిస్టు విప్లవకారుడు.... కామ్రేడ్ జే కే ఆర్ గారి జెఎస్ఆర్ సార్
( జై భారత్ మహావీర్
క్రాంతి త్రినేత్రుడు
ఋషి బో ర దేవాన్ష్
జె కె ఆర్ గారి.....
జైశ్రీరామ్
సుభాష్ చంద్రబోస్
రెడ్ సన్ నేతాజీ రాజన్న
జె ఎస్ ఆర్ సార్ )
కొద్దిసేపటి క్రితం దేశ ప్రజానీకానికి రాసిన బహిరంగ లేఖ లో స్పష్టం చేశారు
మీ ఆర్థికాభివృద్ధి జరిగింది.
మీకు ఎక్కువ డబ్బు వచ్చింది.
బ్యాంకు గణాంకాలు పెరిగాయి.
కానీ అందువల్ల పొలంలో గోధుమపంట ఎక్కువవలేదు
ఆవు పొదుగులలో పాలు ఎక్కువవలేదు
చెరువులో చేపలు ఎక్కువవలేదు,
కాబట్టి డబ్బులు ఎక్కువవడం వల్ల, డబ్బులు పెరగని వారి వాటాకు చెందిన గోధుమలు, పాలు, చేపలు మీకు వస్తాయి.
ఆదివాసులు, గ్రామీణుల వనరులను దోచుకోవడానికి సైనికులను ఉపయోగించడానికి అనుకూలంగా ప్రభుత్వానికి లేదా పెట్టుబడిదారులకు సేవ చేస్తున్న పట్టణ మధ్యతరగతి వర్గం ఉంది.
కానీ ఒక దేశంగా ఉండటానికి షరతులు ఏమిటి?
ఒక జెండా, లేదా ఒక ప్రభుత్వం, లేదా ఒక సరిహద్దు మనల్ని ఒక దేశంగా చేయవనీ ప్రజా నేస్తం కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ స్పష్టం చేశారు.
ఒక దేశంగా ఉండటానికి ఏకైక షరతు ఏమిటంటే దేశంలోపల ప్రజల మధ్య యుద్ధం జరగకూడదు.
కానీ ఒకవేళ పేదలు, ఆదివాసులు, గ్రామీణుల భూములను కబ్జా చేసుకోవడానికి దేశంలోని ధనవంతులు పోలీసు తుపాకులను ఉపయోగిస్తే కనక
దేశం అంతర్యుద్ధం వైపు వెళుతోందని అర్థం చేసుకోండనీ... దేశ మేధావులను ప్రజలను అభ్యర్థించారు అణగారిన వర్గాల సంక్షేమం కోరుకునే సామాజిక పరివర్తకుడు.... సమసమాజ స్థాపన కాంక్షించే కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్...
దోపిడి భూస్వామ్య ధనస్వామ్య పెట్టుబడుదారుల ప్రయోజనాలను నెరవేర్చడానికి కాపలా కుక్కల్లాగా పనిచేస్తున్న చదువుకున్న విద్యావంతులు, మేధావులుగా ఫోజు పెట్టి దళారి పాత్ర పోషిస్తున్న దొంగ విద్యావంతులకు ఇకనైనా జ్ఞానోదయం జరిగితే వాస్తవాలు ప్రజలకు చెప్తారని.... ప్రజలకు వాస్తవాలు తెలియనంత కాలం ప్రజలు ప్రజా యుద్ధంలో భాగస్వామ్యం కాలేరని.... ప్రజలను సామాజిక సాంస్కృతిక రాజకీయ ఆర్థిక చైతన్యవంతులను చేసే విద్యావంతులు నేటి సమాజానికి అవసరమని పేద ప్రజల హక్కుల కోసం పనిచేసే ప్రజాతంత్ర ఉద్యమకారుడు కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ పేర్కొన్నారు...
ప్రజల రాజ్యాధికారం కోసం జరుగుతున్న యుద్ధంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సాయుధంగా పోరాడుతున్న మావోయిస్టులను కోరారు
కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్...
ఎందుకంటే ఈ యుద్ధం ఎవరిపై జరుగుతుందో వారు ఈ దేశ ప్రజలలో తొంభై శాతం మంది.
ఈ అభివృద్ధి నమూనా దేశాన్ని అంతర్యుద్ధం వైపు నడిపిస్తుంది.
-ప్రజా బంధువు అవార్డు గ్రహీత... కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్....
ఫోన్ నెంబర్
8328 277 285
98495 40078