ఉరి వేసుకుని మహిళా మృతి

తిరుమలగిరి 29 మార్చి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల పరిధిలోని తొండ గ్రామానికి చెందిన వేల్పుగొండ మంజుల (42) ఆమె ఇంటి ప్రక్కన ఉన్న పాలివారైన వేల్పుగొండ ఎల్లయ్య, వెలుపుగొండ ఎల్లమ్మ, వేల్పుగొండ లచ్చమ్మ మరియు గోల్కొండ జానకమ్మ వారికి గొడవ జరగడంతో మృతురాలిని వారు తిట్టడంతో వెల్పుగొండ మంజుల మనస్తాపం చెంది ఆమె తన ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో ఉదయం తమ ఇంట్లో చున్నీతో సీలింగ్ ఫ్యాన్‌కు ఊరి పెట్టుకోగా, ఇంతలో కుటుంబ సభ్యులు చూసి ఆమెను చికిత్స నిమిత్తంం ఆస్పత్రికి తరలించేే మార్గమరద్యంలో మృతి చెందింది, ఆమె కుమారుడు వేల్పుగొండ యాకస్వామి తండ్రి నాగయ్య, పిర్యాదు చేయగా, పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపడుతున్నామని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు