వార్షికోత్సవానికి సిద్ధమవుతున్న 67 ఏళ్ల క్రితం బడి

తిరుమలగిరి 17 మార్చి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1958లో ఉన్నత పాఠశాల గా ఏర్పడి 1969 వరకు HSC వరకు నడిచి 1969 నుండి SSC వరకు 10వ తరగతి వరకు కుదించబడి దాదాపు 67 సంవత్సరాల నుంచి వెనుకబడిన ప్రాంతంలో విద్యాసేవనందిస్తూ రేపు 18-3- 2025న పాఠశాల వార్షికోత్సవం జరపడానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు AAPC కమిటీ ఉపాధ్యాయ బృందం ప్రయత్నం చేయుచున్నది ప్రధానోపాధ్యాయుడు దామర శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఈనాడు ఈ రాష్ట్రం దేశంలోనే కాదు ప్రపంచం నలుమూలల వారి వారి సేవలు అందిస్తున్నారు అనేకమంది విద్యార్థులను రాజకీయ నాయకులుగా వ్యాపారవేత్తలుగా విద్యావేత్తలుగా తీర్చి దిద్దింది బడి ప్రభుత్వ పాఠశాల మనుగడ అసాధ్యమైన ఈ రోజుల్లో ప్రస్తుతం పని చేయుచున్న ఉపాధ్యాయ బృందం రాబోయే తరాలకు ప్రభుత్వ విద్య అందుబాటులో ఉండాలని సుసంకల్పంతో ఈ పాఠశాలను అనేక విధాలుగా తీర్చిదిద్దుతున్నారు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రతి విద్యార్థికి అవసరమైన మౌలిక వసతులు పాఠశాలలో ఏర్పాటు చేయబడుచున్నవి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వారి వారి సామర్థ్యాలు సాధించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు జిల్లాలోనే ఒక ఉత్తమ పాఠశాలగా వెలుగొందుతున్నది అటువంటి ఘన చరిత్ర కలిగిన పాఠశాల వార్షికోత్సవం జరుపుకోవడం సర్వదా సంతోషదాయకం ఈ కార్యక్రమానికి విద్యార్థులు ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు పూర్వ ఉపాధ్యాయులు అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కొరరూ