ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మావోయిస్టులు, అజ్ఞాతం వీడండి అని కొరెరు -
వేణుగోపాల్ రెడ్డి గుజ్జుల జాతీయ మానవ హక్కుల సంఘం.*
ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న పరిస్థితులను, యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకొని, కేంద్ర బలగాలకు మరియు సాయుధ బలగాలకు జరుగుతున్న పోరాటాన్ని, దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య పరిస్థితులు బాగాలేని, ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మేధావులైన, మొదటి తరం మావోలను అజ్ఞాతం వీడాల్సిందిగా జాతీయ మానవ హక్కుల సంఘం గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి కోరేరు, అక్కడే ఉండి పోరాటం చేయలేక, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉండే దానికంటే, అజ్ఞాతం వీడి ప్రభుత్వం అందజేస్తున్న చేయూత పథకాన్ని అందుకొని, ఆరోగ్య సమస్యల్ని మెరుగుపరచుకొని, ప్రజా సమస్యల కోసం అజ్ఞాతం నుండే కాకుండా, ప్రజల్లో, ప్రజలతో ఉండి కూడా ప్రభుత్వంతో రాజకీయపరమైన యుద్ధం చేయడానికి ఆస్కారం ఉందని తెలియజేశారు, కావున ఈ అంశాన్ని చర్చించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని, మీ ఆరోగ్య పరిస్థితులు, సమస్యలను అధిగమించడానికి ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను, అలాగే కోడి మంజులక్క మరియు తారక్క లాంటి అగ్ర నాయకులు కూడా ఆరోగ్య పరిస్థితి బాలేక, పార్టీతో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని, జనజీవన స్రవంతిలో కలిసి, వారి ఆరోగ్య పరిస్థితిలో మెరుగుపరుచుకునే విధంగా ప్రభుత్వ అందించే సహకారంతో ముందుకు వెళ్తున్నారని గుర్తు చేశారు, అలాగే ఎంతోమంది మావోయిస్టులు యుద్ధం చేయలేక, యుద్ధ పరిస్థితిని అర్థం చేసుకోలేక, యుద్ధానికి భయపడి చాలామంది లొంగిపోయి పునరావాసము ఏర్పాటు చేసుకున్నారని, చతిస్గడ్ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని, ఒరిస్సా రాష్ట్రంలో గాని, తెలంగాణ రాష్ట్రంలో గాని, మరియు మహారాష్ట్రలో గాని, ఎంతోమంది లొంగిపోయి సాధారణ జీవితాన్ని గడుపుతున్నారని గుర్తు చేశారు, కావున ఈ అంశంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకొని మీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, మీరు అక్కడ ఉన్న ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కోల్పోయే దానికన్నా, మీ తోటి వారి ప్రాణాలు పోవడానికి పాత్రులయ్యేదానికన్నా, ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని అజ్ఞాతం వీడుతారని ఆశిస్తున్నాను అన్నారు, అలాగే పునరావాసం విషయంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సహాయాన్ని, మీ యొక్క ఆరోగ్య పరిస్థితులు అన్నిటికీ, మా జాతీయ మానవ హక్కుల సంఘం అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను. మా జాతీయ మానవ హక్కుల సంఘం ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని, మా బృందం మీకు తోడుగా ఉంటుందని, మీ ఆరోగ్య పరిస్థితులలో మరియు మీ కుటుంబ పరిస్థితులలో, మీ ఆర్థిక విషయాలలో అన్నిటిని మెరుగుపరిచే విధంగా ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వంతో మాట్లాడి అన్ని విధాల సహకరిస్తామని అన్నారు, అన్యాయంగా ప్రాణాలు కోల్పోవద్దని, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆలోచించి అజ్ఞాతాన్ని వీడి బయటకు వచ్చి, మీ ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరుచుకొని, ప్రజా సమస్యల కోసం ప్రజల మధ్యలో ఉండి పోరాటం చేయమని కోరేరు. లక్షలమంది ప్రజలు ఈ పరిస్థితులను తటుకోలేక వారి ఇల్లు , పొలాలు వదిలి వలస వెళ్తున్నారు , దానివల్ల వారి జీవితాలు చాలా దయనీయ స్థితిలో ఉన్నాయి అని, వారి గురించి కూడా ఆలోచించాలి అని కోరెరు.