భువనగిరి ఎంపీ కి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు
అడ్డగూడూరు 1 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- హైదరాబాదులోని పెద్ద అంబర్పేట్ ఎంపీ క్యాంప్ ఆఫీస్ లో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని అడ్డగూడూరు మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎంపీని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు వల్లభట్ల రవీందర్ , జిల్లా కాంగ్రెస్ నాయకులు రాచకొండ సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు