**సామాజిక యోధుడు బాబు జగ్జీవన్ రావు"జయంతి వేడుకలు కోదాడలో*

Apr 5, 2025 - 19:26
 0  5
**సామాజిక యోధుడు బాబు జగ్జీవన్ రావు"జయంతి వేడుకలు కోదాడలో*

"తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ: సామాజిక యోధుడు బాబు జగ్జీవన్ రామ్"

కె .ఆర్ .ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల కోదాడలో ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసంస్కర్త, భారతదేశ మొట్టమొదటి కేంద్ర కార్మిక శాఖ మంత్రి, గాందేయవాది, భారతదేశ మాజీ ఉప ప్రధాని "బాబు జగ్జీవన్ రాం" జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. ఎన్.ఎస్.ఎస్.ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ఎకనామిక్స్ లెక్చరర్ ఆర్. పిచ్చిరెడ్డి మాట్లాడుతూ... ఆనాడు స్వాతంత్రం కోసం పోరాడుతూ, సాంఘిక సమానత్వం కోసం పిడికిలి బిగించి, బడుగు బలహీన వర్గాలు విద్యావంతులు కావాలని ఆశించిన వ్యక్తి జగ్జీవన్ రామ్ అని అన్నారు. హరిత విప్లవాన్ని విజయ పథంలో నడిపించిన మహోన్నతుడు అని, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా తనదైన శైలిలో సేవలందించారు అన్నారు. ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం అధికారి, తెలుగు లెక్చరర్ వేముల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ఆనాడు కేంద్ర కార్మిక మంత్రిగా, రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా, కమ్యూనికేషన్ మంత్రిగా,రవాణా మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా, కేంద్ర ఆహార శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా, ఉత్తమ పార్లమెంటేరియన్ గా వివిధ హోదాలలో పనిచేసి భారతదేశ ప్రతిష్టను పెంచారని అన్నారు. కేంద్ర ఆహార వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కోదాడలోని కె.ఆర్.ఆర్ ప్రభుత్వ కళాశాలకు శంకుస్థాపన వారి చేతులమీదుగా జరగడం మరిచిపోలేని మధురగట్టమని అన్నారు. దేశంలో సుదీర్ఘకాలం కేంద్ర మంత్రిగా చేసిన ఘనత వారిదేనని అన్నారు. 

ఈ కార్యక్రమంలో చరిత్ర ఉపన్యాసకులు రేపాకుల గురవయ్య, గుండా యాదగిరి, దొనకొండ శ్రీనివాసరావు, ఆర్. నరసింహ పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State