నేడు అసెంబ్లీలో కూటమి సర్కార్ తొలి బడ్జెట్*

అమరావతి :ఫిబ్రవరి 28
కూటమి సర్కార్ అధికారి అధికారంలోకి వచ్చి 8 నెల లు పూర్తవడంతో ప్రజలు సూపర్ సిక్స్ హామీల సంగతి ఏంటని? ప్రభుత్వా న్ని ప్రశ్నించేందుకు సిద్ధమ వుతున్నారు. ఆ హామీల అమలే లక్ష్యంగా నేడు బడ్జెట్ ప్రవేశపెట్టినం దుకు కూటమి సర్కార్ రెడీ అయింది,
ఇవాళ అసెంబ్లీ 2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ బడ్జెట్‌నుప్రవేశపెట్టబోతోం ది,ఉదయం 9గంటలకు కేబినెట్ అమోదించాక.. సభలో ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడతారు. మరి కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ ఎలా ఉండబోతోంది.
ఏపీలో అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయి బడ్జెట్‌ని ప్రవేశపెట్టబోతోంది కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. సూపర్ సిక్స్ పథకాలతో పాటు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈసారి బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నా యి. ఆర్ధిక వ్యవస్థను గట్టెక్కించే మార్గాలతో పాటు మూలధన వ్యయం పెంచే విధంగా బడ్జెట్ రూపొందించినట్టు తెలుస్తోంది.
ప్రత్యేకించి విజన్ 2047 లక్ష్యంగా బడ్జెట్ రూప కల్పన జరగుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతు న్నాయి. 3.20 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం ఉంటుం ది. అందులో బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత 10 గంటలకు శాసనసభలో మంత్రి పయ్యావుల బడ్జెట్ ప్రవేశపెడతారు.
ఆర్ధిక బడ్జెట్ అనంతరం వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశ పెడతారు.తల్లికి వందనం పథకంతో పాటు అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం లాంటి పథకాలను అమలు చేయా ల్సి ఉంది. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం పెద్ద మొత్తంలో మూలధన వ్యయాన్ని పెంచే అవకా శాలు కనిపిస్తున్నాయి.
2025 లక్ష్యాలను సాధిం చేలా ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రాధాన్యతలను ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వారివారి నియోజకవర్గాల అభివృద్ధి కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు ఆస్కా రం ఉన్నట్టు సమాచారం. డ్వాక్రా మహిళలు, రైతు లకు ఆర్ధికంగా చేయూతని చ్చేలా వారికి వడ్డీలేనిరుణా ల అంశాన్ని కూడా బడ్జెట్లో పేర్కోనే అవకాశాలు ఉన్న ట్టు తెలుస్తోంది.
ఎన్టీఆర్ వైద్య సేవ కింద హైబ్రీడ్ బీమా యోజనను కూడా ప్రభుత్వం ప్రకటించ నుందని సమాచారం. డిజి టల్ గవర్నెన్స్, ఐటీ హబ్‌ల అభివృద్ధి, పరిశ్రమల వృద్ధి తదితర రంగాల్లో ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకుంటూ, రాష్ట్ర బడ్జెట్‌లో విద్య, ఆరోగ్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
పాఠశాలల మౌలిక సదుపా యాల మెరుగుదల, ఉచిత ఆరోగ్య సంరక్షణ పథకాలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల బలోపేతం ఈ బడ్జెట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవను న్నాయి.అసెంబ్లీలో మంత్రి పయ్యావుల బడ్జెట్ ప్రవేశ పెడితే.. వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు..
మంత్రి అచ్చెన్నాయుడు. అలాగే.. శాసనమండలిలో బడ్జెట్‌ను మంత్రి కొల్లు రవీం ద్ర.. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు. 2024 జూలైలో అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం తొలిసారి పూర్తి స్థాయిలో ప్రవేశ పెడుతున్న బడ్జెట్ కావడంతో.. ప్రాధాన్యం సంతరించుకుంది...