పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి హాల్ టికెట్ నెంబర్లు వేయిస్తున్న ఎంఈఓ దారాసింగ్

Mar 20, 2025 - 20:37
 0  3
పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి హాల్ టికెట్ నెంబర్లు వేయిస్తున్న ఎంఈఓ దారాసింగ్

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి. ఆత్మకూరు ఎస్... నేటి నుండి జరిగే పదవ తరగతి పరీక్షలకు మండలం లోని 3 పరీక్షా కేంద్రాలలో గురువారం అన్ని ఏర్పాట్లు చేశారు. మండలo లో ఆత్మకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్, నెమ్మికల్ పీజీఎఫ్ ప్రైవేట్ పాఠశాలల్లో మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిలో విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్లతో పాటు అన్ని ఏర్పాట్లు చేశారు. మండలం లో ని మొత్తం 15 పాఠశాలల నుండి 399 మంది విద్యార్థులు పరీక్షలు రాయానున్నారు. 3పరీక్షా కేంద్రాల లో 25మంది ఇన్విజిలేటర్ లు, ముగ్గురు సిఎస్ లు, ముగ్గురు డీ ఓ లు విధులు నిర్వర్తించనున్నారు.కాగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 150 మంది, మోడల్ స్కూల్లో 106, నెమ్మికల్ పిజిఎఫ్ పాఠశాలలో 143 మంది విద్యార్థులు పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫున వైద్య పరీక్షల కోసం ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేశారు.గురువారం ఎంఈఓ ధారాసింగ్ ఎంఆర్సి భవనంలో ఇన్విజి లెటర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించి పరీక్షల సమయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.