మోడల్ స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన మండల విద్యాధికారి

తిరుమలగిరి 29 నవంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలంలో ఆనంతారం మోడల్ స్కూల్ ను అకస్మిక తనిఖీ చేసిన మండల విద్యాధికారి తక్షణమే విద్యార్థులచే ఫుడ్ కమిటీలు ఏర్పాటు చేయవలసిందిగా కోరడమైనది. ఫుడ్డు తయారుచేసిన తర్వాత ప్రధానోపాధ్యాయులు లేదా ఇంచార్జ్ మొదటగా భోజనం చేసిన తర్వాతనే విద్యార్థులకు వడ్డించవలెను అని సూచనలు చేయడం జరిగింది వంట తయారు చేస్తున్న ప్రాంగణంలో పరిశుభ్రత వంట నిర్వాకులు వారు కూడా పరిశుభ్రతను పాటించాలి మరియు పాఠశాల ప్రాంగణంలోనే తయారు ఫుడ్ కమిటీల వివరాలు ఎం ఆర్ సి కి పంపించవలసింది. విద్యార్థులు కూడా పరిశుభ్రతను పాటించవలసిందిగా కోరడమైనది. పరిశుభ్రమైన నాణ్యమైన కూరగాయలు, వంట సామాగ్రి పరిశుభ్రముగా ఎప్పటికప్పుడు సరి చూసుకోవాల్సిందిగా కోరనైనది. మధ్యాహ్న భోజనం విషయంలో అవసరం మేరకు చర్యలు తీసుకోవాలని తెలిపారు