పౌష్టికాహార మాసోత్సవాలు

Sep 28, 2024 - 17:12
 0  11
పౌష్టికాహార మాసోత్సవాలు
పౌష్టికాహార మాసోత్సవాలు

తల్లికి, బిడ్డకు పౌష్టికాహారం ఎంతో అవసరమని జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం స్థానిక చర్చి కంపౌండ్ లో జమ్మిగడ్డ సెక్టార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పౌష్టికాహార మహోత్సవాల్లో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు 
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పౌష్టికాహార ప్రయోజనాలపై వారు అవగాహన కల్పించారు. గర్భిణులు, బాలింతలు, బాలికలు వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ తక్కువ ఖర్చుతో అధిక బలాన్ని ఇచ్చే ఆకుకూరలు పండ్లు కూరగాయలు పాలు ఎక్కువగా తీసుకొని రక్తహీనత పౌష్టికాహార లోపం లేకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ సుబ్బలక్ష్మి, జమ్మిగడ్డ సెక్టర్ 
ఐసిడిఎస్ సూపర్వైజర్ దాసరి నగిత, కౌన్సిలర్ శ్రీవిద్య జ్యోతి కరుణాకర్, అంగన్వాడీ టీచర్స్, ఆయాలు, తల్లిదండ్రులు,గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333