మహిళను మంచానికి కట్టేసి అర్ధరాత్రి బంగారం చోరీ

అర్థరాత్రి వేళ బంగారం చోరి
- మంచానికి కట్టేసి,నోట్లో గుడ్డ పెట్టి పగడ్బంధిగా చోరి
- మొత్తం 9 తులాల చోరి
- ఇంటివెనక నుండి ఇంట్లోకి చొరబడి
- ఎవరికైనా చెబితే చంపుతామంటూ బెదిరింపు
తిరుమలగిరి నాగారం 20 జూన్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని ఈటూరు గ్రామంలో అర్థరాత్రి వేళ బంగారం 9 తులాల బంగారం చోరి చేశారు.నాగారం ఎస్సై యం.ఐలయ్య తెలిపిన వివరాల ప్రకారం నాగారం మండల పరిధిలోని ఈటూరు గ్రామంలోని 17.06.2025 రోజున అందాజా రాత్రి 1గంటల సమయంలో ఈటూరు గ్రామానికి చెందిన నంగునూరి బయ్యమ్మ ఒకతె ఇంటి బయట వరండాలో నిద్రిస్తుండగా గుర్తుతెలియని 4 వ్యక్తులు ఇంటి వెనక నుండి ఇంట్లోకి చొరబడి నంగు బయ్యమ్మ రెండు చేతులు మంచానికి చీరతో కట్టి అరవకుండా నోటిలో గుడ్డ పెట్టి నల్లపూసల గొలుసు,బంగారు పెద్ద చైను,బంగారు పుస్తెల తాడు మొత్తం కలిపి 9 తులాలు నడుముకు ఉన్న చెక్కుడు సంచిలో 2500 దొంగిలించి ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారని బాధితురాలు బయ్యమ్మ ఫిర్యాదు ఇచ్చినట్టు తెలిపారు....