పోషణ పక్వాడ్ అవగాహన ర్యాలీ

తిరుమలగిరి 12 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం సెక్టార్ జలాల్ పురం తుంగతుర్తి ప్రాజెక్టు కింద హేమ్లా తండా లో పోషణ పక్షంలో భాగంగా గర్భిణీ స్త్రీలు మరియు చిన్న పిల్లల ఆరోగ్యం పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ రమాదేవి మాట్లాడుతూ వెయ్యి రోజుల ప్రాముఖ్యత గర్భిణీగా ఉన్న 250 రోజులు బిడ్డ పుట్టినంక రెండు సంవత్సరాలు అంటే 720 రోజులు వరకు మొత్తం వెయ్యి రోజుల గురించి పాటించాల్సిన జాగ్రత్తల గురించి రక్తహీనత రాకుండా ఆకుకూరలు పప్పులు, చిరుధాన్యాలు గురించి వివరించి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎస్ హెడ్మాస్టర్ కాసిం యాకమ్మ అనిత విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు