కస్తూర్బా గాంధీ వసతి గృహంలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన

తిరుమలగిరి 25 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
వర్షాకాలంలో నీరు కలుషితమై సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి మల్లెల వందన అన్నారు. గురువారం తిరుమలగిరి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని విద్యార్థినిలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యాధికారిణి మాట్లాడుతూ నీరు, ఆహారం, పరిసరాలు కలుషితం కావడం వల్ల విరోచనాలు, టైఫాయిడ్, కామెర్లు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలని పరిశుభ్రమైన నీరు శుభ్రమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో దోమలు వృద్ధి చెంది డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్లాస్టిక్ డబ్బాలు కొబ్బరి చిప్పలు మురుగునీటి కాలువల్లో నీరు నిలువ ఉండకుండా పరిసరాల్లో శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థిని లకు ఎవరికైనా జ్వరం కానీ ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే మా వైద్య సిబ్బందికి తెలియజేయాలని సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారిణి రాపోలు సుస్మిత, పాఠశాల ఏఎన్ఎం టీచర్ సంతోష, మరియు తదితర ఉపాధ్యాయిని లు ఆశా వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.....