ఎంపీ శ్యామల జన్మదిన సందర్భంగా విద్యార్థులకు నోటుబుక్కులు పంపిణీ
శాలిగౌరారం 24 జూలై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వాసి భువనగిరి పార్లమెంటు ముద్దుబిడ్డ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా గురువారం రోజు 24 జులై 2025న శాలిగౌరారం మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మండల అధ్యక్షులు కందాల సమరం రెడ్డి,మండల నాయకులు జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కస్తూర్బా బాలికల గురుకుల విద్యార్థులకు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక ఉన్నంత పాఠశాలలను విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులను పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్,మండల నాయకులు,వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు,ఎస్సి సెల్,మైనార్టీ సెల్,గ్రామ శాఖ అధ్యక్షులు,మాజీ ప్రజా ప్రతినిధులు,వివిధ హోదా కల్గిన నాయకులు,సోషల్ మీడియా ఇన్చార్జులు,గ్రామ శాఖ,యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ యు ఐ నాయకులు కార్యకర్తలు,కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.