విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి ఎమ్మెల్యే మందుల సామెల్

తిరుమలగిరి 12 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
ఇంటింటికి మన తిరుమలగిరి బడి పేరిట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ చేతుల మీదుగా కరపత్రం మరియు బ్యానర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా తుంగతుర్తి శాసనసభ్యులు మాట్లాడుతూ విద్యార్థులందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులందరూ కృషి చేయాలని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దామర శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హత అంకితభావం గల ఉపాధ్యాయులచే నడిపించబడుతున్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి ప్రభుత్వం కల్పించే అవకాశాలను వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీీ ఎల్సోజు చామంతి నరేష్ సుంకర జనార్ధన్ కందుకూరి లక్ష్మయ్య జుమ్మిలాల్ సుధాకర్ పార్టీ నాయకులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు