పరిశుభ్రత పాటించండి మున్సిపల్ కమిషనర్

తిరుమలగిరి 25 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
వంద రోజుల ప్రణాళికలో భాగంగా తిరుమలగిరి మున్సిపాలిటీ కార్యాలయంలో కమీషనర్ మున్వర్ అలీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు చేయనైనది. వైద్య శిభిరంలో మున్సిపల్ సిబ్బంది అందరికీ వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీజనల్ వ్యాధుల పట్ల వారు మాట్లాడుతూ నీరు, ఆహారం, పరిసరాలు కలుషితం కావడం వల్ల విరోచనాలు, టైఫాయిడ్, కామెర్లు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలని పరిశుభ్రమైన నీరు శుభ్రమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో దోమలు వృద్ధి చెంది డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్లాస్టిక్ డబ్బాలు కొబ్బరి చిప్పలు మురుగునీటి కాలువల్లో నీరు నిలువ ఉండకుండా పరిసరాల్లో శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మల్లెల వందన, పల్లె దవాఖాన డాక్టర్ సమత, సూపర్ వైజర్ స్వరూప కుమారి, వార్డు ఆఫీసర్లు,హెల్త్ అసిస్టెంట్ కె.నర్సింహ రెడ్డి, పి.విజయ్, ఎల్.టి.రాజు, ఏఎన్ఎం ఎం.రమాదేవి, పి. మాధవి, ఆశా వర్కర్లు మరియు మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ వర్కర్లు పాల్గొన్నారు.