PDSU SFI విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యలో విద్య సంస్థల బంద్ విజయవంతం

Jul 24, 2025 - 09:00
Jul 24, 2025 - 19:22
 0  1
PDSU SFI విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యలో విద్య సంస్థల బంద్  విజయవంతం

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  ఏపూర్ గ్రామంలో PDSU SFI విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యలో విద్య సంస్థల బంద్ విజయవంతం విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏపూర్ గ్రామంలో విద్య సంస్థలు బంద్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా PDSU సూర్యాపేట జిల్లా నాయకులు చిత్తలూరి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ,,,, తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలనా అందిస్తామని అధికారంలోకి వచ్చిన ఈ రేవంత్ రెడ్డి సర్కార్ 2 సంవత్సరలు కావొస్తున్న ఇప్పటి విద్య రంగం ఎదురకొంటున్న సమస్యలపై సమీక్షించింది లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేస్తూ కనీస సౌకర్య కల్పించకుండా కార్పొరేట్ విద్యా సంస్థలకు వత్తాసు పలుకుతూ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను దూరం చేసే పరిస్థితి నెలకొంటుంది కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్నీ డిమాండ్ చేసారు కార్యక్రమంలో PDSU SFI నాయకులు సానబోయిన ఉపేందర్, కుమార్, వంశీ, మద్దేల వేణు వరికుప్పల మహేష్, M మల్లేష్, సాయి k మహేష్ తదితరులు పాల్గొన్నారు డిమాండ్స్:  ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులు నియంత్రణ చట్టం తీసుకురావాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్మెంట్ విడుదల చేయాలి. పెండింగ్లో ఉన్న మెస్, కాస్మోటిక్ చార్జీలను విడుదల చేయాలి. అద్దె భవనాలు నడుస్తున్న వసతిగృహాలకు సొంత భవనాలు నిర్మించాలి. విద్యార్థులకి ఉచిత బస్సు పాసులు ఇవ్వాలి.