పీఆర్సీ కమిటీతో బ్లైండ్ ఎంప్లాయీస్ భేటీ
హైదరాబాద్,, 30 మార్చి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- పీఆర్సీ కమిటీతో బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశమైంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పీఆర్సీ కమిటీ చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలోనే బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులను పీఆర్సీ కమిటీ ఆహ్వానించింది. ఈ సందర్భంగా అంధ ఉపాధ్యాయ, ఉద్యోగుల అవసరాలు, సమస్యలను పీఆర్సీ కమిటీకి అసోసియేషన్ నేతలు వివరించారు. ఈ చర్చల్లో ప్రధానంగా కన్వీనియన్స్ అలవెన్స్, రీడర్ అలవెన్స్, అదనంగా 4 సాధారణ సెలవులు కల్పించాలని కోరారు. బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరుపున రాష్ట్ర అధ్యక్షుడు కె.మల్లేశం, ప్రధాన కార్యదర్శి బి.రాఘవేందర్ రెడ్డి, కె.అనిల్ కుమార్, ఎన్.రవీందర్ పాల్గొన్నారు.