వెట్టి చాకిరి విముక్తికై పోరాడిన యోధుడు పోరెల్ల దాసు

Mar 30, 2024 - 21:08
 0  172
వెట్టి చాకిరి విముక్తికై పోరాడిన యోధుడు పోరెల్ల దాసు

తిరుమలగిరి 31 మార్చి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు సిపిఎం సీనియర్ నాయకులు పోరెల్ల దాసు స్ఫూర్తితో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు పేర్కొన్నారు ఈరోజు పోరెల్ల దాసు ఆరవ వర్ధంతిని పురస్కరించుకొని తిరుమలగిరి మండల కేంద్రంలో వారి చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించి మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం వెట్టి చాకిరికి వ్యతిరేకంగా సాగిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట లో కామ్రేడ్ పోరెల్ల దాసు భీమ్ రెడ్డి నరసింహారెడ్డి నాయకత్వంలో నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా దొరలు భూస్వాముల జాగిర్దారుల దాస్టికాలను నిరసిస్తూ పీడిత ప్రజలను సమీకరించి పోరాటంలో దళనాయకుడిగా ముందుభాగంలో ఉన్నారు. ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన సాగిన పోరాటంలో4000 మంది ప్రాణాలు అర్పించి 10 లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్ర ఆనాటి పోరాటానికి ఉంది నాడు పోరాటంలో లేని కనీసం ఆయుధం పట్టని మతోన్మాదులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం హిందూ ముస్లింల మధ్య జరిగిన ఘర్షణ గా చిత్రీకరిస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నారని కొలిశెట్టి యాదగిరిరావు విమర్శించారు చరిత్ర హీనులు చేసే ఇలాంటి కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని మతోన్మాద బిజెపి అసలు రంగును ప్రజలు త్వరలోనే గుర్తిస్తారని తెలంగాణ లో వారి పాచికలు పారవని కొలిశెట్టి యాదగిరిరావు అన్నారు. పీడిత ప్రజల కోసం పోరేల్లదాసు చివరిదాకా పోరాడినారని ఆ పీడిత ప్రజల కోసం సమసమాజ స్థాపన కోసం ఈ దేశంలో జరుగుతున్న మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా నికరంగా పోరాడుతున్న భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి మహమ్మద్ జాంగిర్ ఓటు వేసి గెలిపించడమే దాసు గారికి నిజమైన జోహార్లు అర్పించిన వారమవుతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గుమ్మడి వెల్లిఉప్పలయ్య మండల కమిటీ సభ్యులు కడెం లింగయ్య చిత్తలూరు సోమయ్య బందెల అబ్రహం కందుకూరి సోమయ్య కొత్తగట్టు మల్లయ్య తన్నీరు రాం ప్రభువు కిష్ట్ నాయక్ నిర్మల యాకయ్య వనం సోమయ్య తాడికొండ సీతయ్య దాసు కుటుంబ సభ్యులుపోరెల్ల సోమయ్య లక్ష్మయ్య సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034