ఎమ్మెల్యే మందుల సామేలు చొరవతో లక్ష్మీదేవికాల్వ పల్లె వెలుగు బస్సు పునరుద్ధరణ

అడ్డగూడూరు17 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని లక్ష్మీదేవికాల్వ గ్రామానికి ఎమ్మెల్యే మందుల మందుల సామేల్ చొరవతో సూర్యాపేట జిల్లా డిపో పల్లె వెలుగు బస్సు ఉదయం 9 గం ,లకు తిరుమలగిరి నుంచి బయలుదేరి అనంతారం, చిర్రగూడూరు,చౌల్లరామారం అడ్డగూడూరు మండల కేంద్రం మీదుగా ధర్మారం,లక్ష్మీదేవికాల్వ గ్రామానికి 9:45కు చేరును.లక్ష్మీదేవికాల్వ నుండి 10 గం ,లకు భయలుధేరి సూర్యాపేట కు12:20 కి చేరును.12:30కి సూర్యాపేట నుండి భయలుధేరి 2:30కి లక్ష్మీదేవికాల్వ,తిరుమలగిరి కి వెళ్లి మళ్ళీ 4:10 కి లక్ష్మీదేవికాల్వ కు చేరును.ఇక్కడి నుండి 5 గం ,లకి తిరుమలగిరి చేరును.ఈబస్సు పునరుద్ధరణ పట్ల మండల వాసులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.ఈబస్సు సర్వీసు మండల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.