మార్కెట్ యాడ్లను ఆకస్మిక తనిఖీ చేసిన జూపల్లి

13-05-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.కొల్లాపూర్ మార్కెట్ యార్డును ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి జూపల్లి
ప్రభుత్వం సరిపడా టెర్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచినప్పటికీ, మార్కెట్ యార్డు సిబ్బంది రైతులకు అందించడంలో అలసత్వం వహించడంపై అధికారులపై మంత్రి ఆగ్రహం.
మార్కెటింగ్ డైరెక్టర్, జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడిన మంత్రి జూపల్లి_ _ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టెర్పాలిన్ కవర్లు సరిపడా ఉంచాలని, రైతులకు ఇబ్బంది కలగకుండా అధికారులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశం.
కొల్లాపూర్ మార్కెట్ యార్డును మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు_. ఈ సందర్భంగా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, అక్కడి రైతులతో నేరుగా మాట్లాడారు.
రైతులు మార్కెట్ యార్డు సెక్రటరీ విధుల పట్ల అలసత్వంగా వ్యవహరిస్తున్నారని,అవసరమైన సదుపాయాలు కల్పించడం లేదని మంత్రి గారి దృష్టికి తీసుకువచ్చారు.
ప్రభుత్వం తరఫున సరిపడా టెర్పాలిన్ కవర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, అవి రైతులకు అందకపోవడంపై సెక్రటరీ తో ఫోన్లో మాట్లాడుతూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
_ఈ సందర్భంలో మంత్రి గారు మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మి గారితో, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గారితో ఫోన్‌లో మాట్లాడి, తక్షణమే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు_. _వర్షం కారణంగా ధాన్యం తడవకుండా ఉండేందుకు టెర్పాలిన్ కవర్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.
ధాన్యం తేమ శాతం వచ్చిన వెంటనే తూకం వేసి, ధరతో పాటు పూర్తి వివరాలతో కూడిన రసీదు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 2320, సాధారణ రకానికి రూ. 2300 మద్దతు ధరగా చెల్లించనున్నట్లు, సన్న రకానికి అదనంగా రూ. 500 బోనస్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని మంత్రి తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అధికారులంతా పూర్తిస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండాలని ఆయన హెచ్చరించారు_. _రైతులను వేధించిన అధికారులపై చర్యలు తప్పవని మంత్రి కఠినంగా హెచ్చరించారు.