నూతన ములుగు జిల్లా అధ్యక్షులు ఎంపిక

Mar 10, 2025 - 19:20
 0  7
నూతన ములుగు జిల్లా అధ్యక్షులు ఎంపిక
నూతన ములుగు జిల్లా అధ్యక్షులు ఎంపిక

నూతన ములుగు జిల్లా అధ్యక్షులు ఎంపిక

జిఎస్పి ములుగు జిల్లా అధ్యక్షులుగా పూనెం ప్రతాప్...

ఆదివాసి అస్తిత్వం కై పోరాడాలని.రాష్ట్ర అధ్యక్షులు పాయం.

తెలంగాణ వార్త 

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గొండ్వాన సంక్షేమ పరిషత్ సంఘ అత్యవసర సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ హాజరై ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తూ. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసి చట్టాలు పూర్తిస్థాయిలో అమలు జరిగేంతవరకు గొండ్వాన సంక్షేమ పరిషత్ పోరాడుతుందని,అలాగే ఏజెన్సీ న్యాయ కళాశాల భద్రాచలం ఏర్పాటు చేసే వరకు ప్రభుత్వం పై దండయాత్ర కొనసాగుతుందని అన్నారు.అలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల ములుగు జిల్లా కమిటీని చేర్పులు మార్పులు చేస్తూ, ములుగు జిల్లా అధ్యక్షులుగా పూనెం ప్రతాప్ ఎన్నుకోవడం జరిగిందని, ములుగు జిల్లా జిఎస్పి సంఘ కార్యక్రమం బాధ్యతలు పూర్తిగా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ పూనెం ప్రతాప్ తీసుకుంటారని రాష్ట్ర సత్యనారాయణ తెలిపారు.

Alli Prashanth ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్