షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలి

Mar 24, 2025 - 19:23
Mar 25, 2025 - 02:27
 0  55
షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలి

అడ్డగూడూరు 24 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరుపున అడ్డగూడూరు మండల కేంద్రంలో మూడవ మహాసభ పట్టేటి యాదగిరి అధ్యక్షతన జరిగింది.ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా జిల్లా రైతు సంఘం సహాయ కార్యదర్శిలు జక్కా దయాకర్ రెడ్డి ఉప్పుల కొమరయ్య హాజరై మాట్లాడుతూ.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలన్నిటిని రైతు భరోసా రైతు రుణమాఫీ వెంటనే విడుదల చేయాలని అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని పెండింగ్ ప్రాజెక్టులకు కావలసిన నిధులు వెంటనే విడుదల చేసి టెండర్లు పిలిచి కాలువలు మరమ్మతులు చేసి వ్యవసాయ రంగానికి సాగునీరు గ్రామాలలో తాగునీరు వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.పాల రైతులకు ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.రైతులకు కావలసిన వ్యవసాయ పరికరాలు సబ్సిడీ రేటు పై ఇవ్వాలని డిమాండ్ చేశారు.రైతుల పట్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి విడనాడాలని డిమాండ్ చేశారు.లేనియెడల గ్రామాలలో అన్ని వర్గాల రైతులను రాజకీయంగా చైతన్యవంతంగా చేసి ఉద్యమాలు ఉధృతం చేస్తామని విజ్ఞప్తి చేశారు.ఈ మహాసభలో సిపిఐ జిల్లా సహకార దర్శి యానాల దామోదర్ రెడ్డి కార్యవర్గ సభ్యులు చేడే చంద్రయ్య, మండల పార్టీ కార్యదర్శి రేకల శ్రీనివాస్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్,ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి బెల్లి శ్రీకాంత్,చెడిపల్లి రవీందర్,బోనుగ సుదర్శన్ రెడ్డి, సోలిపురం నాగిరెడ్డి,బొంగు లింగయ్య, జక్కుల దుర్గయ్య,ఎల్లంల నరేష్,పట్టేటి యాదగిరి,తిరుపతి లక్ష్మీనారాయణ, గుడిలి యాదయ్య,ముక్కాముల మహేష్,గొలుసుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.తదనంతరం ఏకగ్రీవంగా నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా భానుగా సుదర్శన్ రెడ్డి,ఉపాధ్యక్షులుగా సోలిపురం నాగిరెడ్డి,ప్రధాన కార్యదర్శిగా చెడిపల్లి రవీందర్,సహాయ కార్యదర్శిగా బొంగు లింగయ్య, కోశాధికారిగా జక్కుల దుర్గయ్య, మరో 9 మందితో కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.