మూసి ఎడమ కాలువ పరిధిలోని ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి.

Mar 10, 2025 - 19:31
 0  3
మూసి ఎడమ కాలువ పరిధిలోని ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి.
మూసి ఎడమ కాలువ పరిధిలోని ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి.

తెలంగాణ వార్త మాడుగులపల్లి మార్చి 10:  మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మూసీ ఎడమ కాలువ పరిధిలోని ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు,మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.సోమవారం మండలంలోని పాములపహాడ్ గ్రామంలో ఎండిపోతున్న పంట పొలాలను రైతులు, సీపీఎం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ ప్రాజెక్టు క్రింద మాడ్గులపల్లి, వేములపల్లి,తిప్పర్తి మండలాల రైతులు ఎకరాకు 30 వేలకు పైగా పెట్టుబడి పెట్టి వారి పంట వేశారన్నారు.ప్రాజెక్టులో నీరు ఉండడం వలన నీరు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయని నమ్మకంతో పంటను వేశారన్నారు.రైతులు అప్పులు తీసుకొచ్చి ఆరుగాలం కష్టపడి పండించిన పంట చివరి దశలో ఎండిపోతున్న కూడా అధికారులు పట్టించుకోకపోవడం చాలా అన్యాయం అన్నారు.ప్రాజెక్టు పైన అజమాయిషీ లేకపోవడం వలన నీళ్ళు ఉన్నా కోసం చివరి రైతాంగానికి నీరు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం మరియు ఇరిగేషన్ అధికారులు స్పందించి నీటిని అందించాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం ఎకరానికి కనీసం 20 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.పంటల భీమా పథకం అమలు చేసి బ్యాంక్ రుణాలను వెంటనే మాఫీ చేయాలన్నారు.ఇది రైతు ప్రభుత్వం అన్ని చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతులను పట్టించుకోక పోవడం చాలా అన్యాయం అన్నారు.వెంటనే మూసీ ప్రాజెక్టు క్రింద ఉన్న పంట పొలాలను ప్రభుత్వం మరియు ఇరిగేషన్ అధికారులు పరిశీలించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, వేములపల్లి మాజీ వైస్ ఎంపీపీ పాదూరు గోవర్దన, వేములపల్లి మాడ్గులపల్లి మండలాల కార్యదర్శులు పాదూరు శశిధర్ రెడ్డి, రొండి శ్రీనివాస్ మండల నాయకులు పతాని శ్రీను,తంగెళ్ళ నాగమణి,అయితగాని విష్ణు,చింతచెర్ల శ్రీను,పిండి వెంకట్ రెడ్డి,సబ్బు రవీందర్ రెడ్డి,అల్గుబెల్లి వెంకట్ రెడ్డి మరియు రైతులు చింతకాయల గంగయ్య,రావు వెంకట్ రెడ్డి,పద్మ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333