నులిపురుగుల నిర్ములన కార్యక్రమం
నులిపురుగుల నిర్ములన కార్యక్రమం
తెలంగాణ వార్త ములుగు స్టాప్ రిపోర్టర్ జూన్/ 19/2024
నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వాజేడు వైద్య అధికారి కొమరం మహేంద్ర ఆదేశాల మేరకు
గ్రామాలలో గ్రామంలో పిల్లలకు, స్కూల్ పిల్లలకు,అంగన్వాడి పిల్లలకు,ఇంటి వద్ద ఉన్న చిన్నారులకు నేడు గురువారం కార్యక్రమం గురించి సబ్ సెంటర్ పరిధిలోగల గ్రామాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రగల్లపల్లి,జగన్నాధపురం గ్రామాలలో అవగాహన కార్యక్రమం ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రగలపల్లి పల్లె దవాఖాన వైద్యాధికారి గ్యానస, వైద్య సిబ్బంది,హెల్త్ సూపర్వైజర్స్ వెంకటరమణ కోటిరెడ్డి, హెల్త్ అసిస్టెంట్ శేఖర్, శ్రీనివాసరావు, ఏఎన్ఎం ఛాయదేవి,రాజేశ్వరి,ఆశా కార్యకర్తలు మానస, ప్రసన్న,వినోద,అక్కమ్మ,o రవణ,సరిత, చిలకమ్మా, నాగమణి,నాగలక్ష్మి పాల్గొనడం జరిగింది.నేడు జరిగే కార్యక్రమానికి పిల్లల తల్లిదండ్రులకు సమాచారం అందించి స్కూలుకు,అంగన్వాడి కేంద్రానికి తల్లిదండ్రులు తీసుకురావాలని వైద్యాధికారి తెలియపరచడం జరిగింది.