జన వికాస సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
తెలంగాణ వార్త సెప్టెంబర్ 14 దంతాలపల్లి:- మండలంలోని రామానుజపురం గ్రామంలో శనివారం నిర్వహించిన జన వికాస సంస్థ ఆధ్వర్యంలో మెడికేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తొర్రూర్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి నాగార్జున్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్నటువంటి సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, పాటించాలని వ్యాధులు ప్రబల కుండా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అన్నారు. జనవికాస నిర్వహించినటువంటి ఉచిత వైద్య శిబిరం ప్రస్తుత పరిస్థితుల్లో ఉపయోగపడుతుందని అన్నారు జన వికాస చేసే కార్యక్రమాలు చాలా బాగుంటాయని అనాధ వృద్ధులు, వికాస పిల్లల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వ్యవస్థాపకులు బాల తెరిసా జింగ్రాస్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెడికేర్ హాస్పిటల్ బృందం డాక్టర్ నరేష్, కవిత, సంధ్య ,విలేజ్ లీడర్ మల్లయ్య, మంజుల, జయమ్మ ,ఆశ వర్కర్ కవిత, సెంటర్ మేనేజర్ కందునూరు సుకన్య, మార్గం శోభ రాణి, గ్రామ లీడర్లు ప్రజలు పాల్గొన్నారు.