పంట పొలాల్లో ప్రమాదకరంగా విద్యుత్ తీగలు

Jul 25, 2025 - 17:11
Jul 25, 2025 - 18:56
 0  34
పంట పొలాల్లో ప్రమాదకరంగా విద్యుత్ తీగలు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ : పంట పొలాల్లో ప్రమాదకరంగా విద్యుత్ తీగలు రెండేళ్లయిన పట్టించుకోని విద్యుత్ అధికారులు. ఆత్మకూరు ఎస్.. మండల పరిధిలోని గట్టికల్లు గ్రామంలో రెండేళ్లు గా ప్రమాద కారoగా ఉన్న విద్యుత్ తీగల ను అధికారులు పట్టించు కోవడము లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి సమీపంలో నీ పల్స వెంకన్న బావి దగ్గర 6 కెవి లైన్ వైర్లు గత రెండు సంవత్సరాల కిందట వర్షాల కారణంగా స్తంభాలు వంగినట్లు తెలిపారు. దానికి సంబంధించిన విద్యుత్ వైర్లు దండం తీగల మాదిరి కిందికి వేలాడుతున్నాయనీ పంట పొలాలు దున్నే సమయంలో రైతులు భయం తో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.పొలాలు దున్నేటప్పుడు నేలకొరిగిన తీగెల ను కర్ర ను సపోర్ట్ గా చేస్తున్నారు.వర్షాల కారణంగా కర్రకు ఎర్త్ పాస్ అయి షాక్ వస్తున్నదనీ పాతిన కర్రను తరచూ కోతులు పడేస్తున్నాయనీ రైతులు భయాందోళన చెందుతున్నారూ . దీనిపై విద్యుత్ అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.