డ్రైనేజీ కాలువలు లేక మురికి కూపంగా మారిన 9,10,24 వార్డుల నుంచి వచ్చి ఒకే చోట చేరుతున్న మురికి నీరు.

జోగులాంబ గద్వాల 7 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి. గద్వాల. పట్టణంలోని 9, 10, 24 వార్డులు డ్రైనేజీ మురుగు కాలువ నీరు ధరూర్ మెట్టు రైచూర్ రోడ్డు రాఘవేంద్ర కాలనీకి వెళ్లే మెయిన్ రోడ్ పక్కల మూడు వార్డుల మురుగు నీరు కాలువల ద్వారా వచ్చి ఒకే దగ్గర నిలిచిపోవడంతో డ్రైనేజీ మురుగునీరు ద్వారా పిచ్చి మొక్కలు తీగలు పారే మొక్కలు పెద్దగా పెరిగి డ్రైనేజీ పక్కనే ఒక పెద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ మురుగునీరు చేరి పిచ్చి మొక్కల తీగలు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ అల్లుకుపోయాయి. అయినా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదు , మురుగునీరు గురించి మున్సిపల్ అధికారులు కానీ జిల్లా ఉన్నతాధికారులు గానీ కన్నెత్తైనా చూడడం లేదని వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు కౌన్సిలర్లు గతంలో ఎన్నిసార్లు అధికారులకు విన్నవించిన కూడా ఈ మురుగునీరు గురించి పట్టించుకోవడంలేదని, రాబోవు తీవ్ర ఎండాకాలం మురుగు నీరు వల్ల దోమలు, క్రిమి కీటకాలు, విషపురుగులు ఇళ్లల్లో వచ్చి చేరుతాయని ,ఆ మురుగు కాలువల దగ్గర నివాసముంటున్న ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు, వేసవికాలంలో దోమల వల్ల వచ్చే వైరల్ ఫీవర్లకు లోను కాకుండా వార్డ్ ప్రజలను కాపాడవలసిందిగా, ప్రజలు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి చేస్తున్నామని ,ఇక్కడ చేరిన డ్రైనేజీ మురుగునీరు నిలిచిపోయి దోమలకు నిలయంగా మారింది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీటిలో చెత్తాచెదారం నిలిచిపోయి ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఇంతేగాక మురుగు మధ్యనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో వార్డు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నత అధికారులు స్పందించి మురుగునీరు చేరకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసి డ్రైనేజీ వ్యవస్థను కాలువల ద్వారా ఏర్పాటు చేయాల్సిందిగా వార్డ్ ప్రజలు కోరుతున్నారు.