కరెంటు షాక్ తో ఆవు మృతి

తిరుమలగిరి 30 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో ఆవు విద్యుదాఘాతంతో మృతి చెందింది. రోజు మాదిరిగానే బుడిగ పిచ్చయ్య రైతు తనకు ఉన్న రెండు ఆవులను బావి వద్దకు తీసుకువెళ్లాడు. అందులో ఒక ఆవు మేత మేసుకుంటూ అదే గ్రామానికి చెందిన వేల్పుల వెంకటయ్య బావి వద్ద ఉన్న ట్రాన్స్ఫారం తీగలు తగలడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న రైతు బుడిగి పిచ్చయ్య ఎడ్చుకుంటూ, ఆవు ఖరీదు లక్ష రూపాయలు ఉంటదని, ప్రభుత్వం స్పందించి నాకు తగిన సహాయం చేయాలని వేడుకున్నాడు...