లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన మహిళ అధికారిణి
10 వేలు లంచం తీసుకుంటూ తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్ ఏసీబీకి పట్టుబడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా తూనికలు, కొలత శాఖ ఇన్స్పెక్టర్ ఉమారాణి వ్యాలిడిటీ సర్టిఫికెట్ చేయడానికి డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు గిరిధర్‌రావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు గురువారం లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.