ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి

తిరుమలగిరి 30 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి చెందిన సంఘటన తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో చోటుచేసుకుంది గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం భూతం బాషి (23) అను యువకుడు తమ వ్యవసాయ క్షేత్రంలోని పొలం దున్ని సాయంత్రం ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో గిద్దె కుంట చెరువు కట్ట ట్రాక్టర్ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది దీంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు మృతుడికి భార్య ఇద్దరు చిన్న పిల్లలు గలరు బాషి మృతితో తొండ గ్రామంలోని విషాదఛాయలు అలుముకున్నాయి...