ఉచిత పశువైద్య శిబిరం
పశుసంవర్దక శాఖ అధికారి డాక్టర్ సౌమ్య_
టేక్మాల్ ఫిబ్రవరి 03 తెలంగాణవార్త ప్రతినిధి :-
మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండలం పరిధిలోని శేరిపల్లి గ్రామంలో పాడి రైతులు తమ పశువుల పెంపకం పోషణ లో తగు జాగ్రతలు తీసుకోవాలని వేల్పుగొండ పశుసంవర్దక శాఖ అధికారి డాక్టర్ సౌమ్య ఆధ్వర్యంలో పశు సంవర్ధక శాఖ సహకారంతో సోమవారం శేరిపల్లి గ్రామంలో ఉచిత పశువైద్య న్ని శిబిరాన్ని నిర్వహించరు. అనంతరం ఆమె మాట్లాడుతూ.... నూతన సాంకేతికతను తక్కువ ఖర్చుతో రైతు ముంగిట్లో చేర్చి 90శాతం కచ్చితంగా అధిక పాల దిగుబడి సామర్థ్యం గల మేలు జాతి ఆడ దూడలు పుట్టించి వాటి ద్వారా రైతులు ఆదాయం పెంపొందించడం, తక్కువ సమయంలో మేలు జాతి అభివృద్ధి చేయడం లింగ నిర్ధారిత వీర్య నాలిక వినియోగం వలన 90శాతం కంటే ఎక్కువ మేలు జాతి ఆడ దూడలు పుట్టి మందలో ఆవులు గేదెల సంఖ్య గణనీయంగా పెరిగి రైతులకు పోషణ మరియు లాభసాటి మారుతుందాన్ని గేదెల్లో ముర్ర, ఆవుల్లో, సాయి వాల్, గిర్,జెర్సీ సంకరజాతి వీర్య నాలికలు అందుబాటులో ఉన్నాయని ఒక లింగ నిర్ధారణ వీర నాలిక ధర 675 రూ" సబ్సిడీ వాటా, రైతు వాటా 250రూ” ఒక పశువు వరుసగా రెండుసార్లు లింగ నిర్ధారణ వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేసినప్పటికీ గర్భం దాల్చకపోతే రైతుకు రెండు సార్లు చెల్లించిన వాటా ధనం 500 తిరిగి రైతు అకౌంట్లో తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ జమ చేస్తుందన్ని మొదటి కృత్రిమ గర్భధారణ విఫలమై రెండో కృత్రిమ గర్భధారణ ద్వారా మగ దూడ జన్మిస్తే 250 రూపాయలు తిరిగి రైతుకు జమ చేయబడుతయాన్ని అన్నారు. ఈ శిభిరంలో 16 పశువులకు గర్భకోశ పరీక్షలు, 18 పశువులకు సాధారణ చికిత్సలు, 13 దూడలకు నట్టల నివారణ మందులు వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టేక్మాల్ మండల పశువైద్య జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ హనుమంతు,సిబ్బంది ఆనంద్ కుమార్ కృష్ణ గోపాల మిత్రులు కే దేవరాజ్, డి . రవీందర్, ఎం దీపక్ కుమార్ పాడి గ్రామస్తులు పాల్గొన్నారు.