ఉద్యోగవిరమణ పొందిన ఎస్సై జగన్ మోహన్ రెడ్డి.

జగన్ మోహన్ రెడ్డి దంపతులను సన్మానించి ఎస్పీ రాహుల్ హెగ్డే
-నిత్యం సవాళ్లతో కూడుకున్నది పోలీసు ఉద్యోగం.
- సుదీర్ఘకాలం పోలీసు శాఖలో ప్రజలకు సేవలు అందించడం అభినందనీయం.
-
రాహుల్ హెగ్డే ఎస్పి
సూర్యాపేట :- శనివారం ఉద్యోగవిరమణ చేసినటువంటి ఎస్.ఐ జగన్ మోహన్ రెడ్డి దంపతులను వారి కుటుంబ సభ్యుల సమక్షంలో జిల్లా పోలీస్ కార్యలయంలో ఎస్పి రాహుల్ హెగ్డే ఐపిఎస్ సన్మానించారు. ఎస్.ఐ కి, వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ పోలీసు డిపార్ట్మెంట్ నందు పోలీస్ కానిస్టేబుల్ గా భర్తీఐ తన 38 సం,లు సేవలు అందించడం గొప్పవిషయం అని, అభినందనీయం అని వారి సేవలను కొనియాడారు. ఈ ఉద్యోవిరమణ అనంతరము వారి కుటుంబ సభ్యుల అందరితో సుఖ సంతోషలతో గడపాలని అని, ప్రజా సేవలో పాల్గొనాలని కోరుకుంటున్నాము అని తెలిపినారు.
పోలీసు ఉద్యోగం నిత్యం సవాళ్లతో కూడినది, ఎన్నో రోజులు కుటుంబాలకు దూరంగా ఉంటూ సేవలు అందించాల్సి వస్తుంది, అలాగే ఎంతో ఇమేజ్ ఉన్న ఉద్యోగం అని అన్నారు.
ఉద్యోగ విరమణ పొందిన ఎస్సై జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సిబ్బంది, ఉన్నతాధికారుల సహకారంతో ప్రజలు సేవలు అందించాని అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్, సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్, సభ్యులు అంజన్ రెడ్డి, వెంకయ్య, DPO సిబ్బంది, ఉద్యోగవిరమణ పొందిన రాంసింగ్ కుటుంభం సభ్యులు పాల్గొన్నారు.