సాయి అఖిల జ్యుయలర్స్ ప్రారంభం
వ్యాపార కేంద్రంగా విస్తరిస్తున్న సూర్యాపేట పట్టణంలోని ప్రధాన వ్యాపార కేంద్రం ఎంజి రోడ్ నందు శనివారం నాడు బంగారు నగల ప్రత్యేక షోరూం సాయి అఖిల జ్యుయలర్స్ ను ప్రముఖ వ్యాపారవేత్త యామా ప్రభాకర్ ప్రారంభించారు. సూర్యాపేట పట్టణంలో బంగారు నగల అమ్మకాలు పెరుగుతున్న సందర్భంగా వివాహాది శుభకార్యాల కోసం నమ్మకమైన నాణ్యత గల అసలు సిసలైన 91.6 హాల్ మార్క్ బంగారు నగలను మార్కెట్ ధరకు అమ్మడానికి ప్రముఖ వ్యాపారి కడివెండి సోమేశ్వర్ యాజమాన్యంలో సాయి అఖిల జ్యుయలర్స్ ప్రారంభిస్తున్నట్లు వారు తెలిపారు. వారి షో రూం నందు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి కొనుగోలుపై బంగారు నగలకు సరిపడే వెండి వస్తువులను ఉచితంగా ఏప్రిల్ 10 వరకు అందజేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా వెండి వస్తువుల కొనుగోలు పై ఎటువంటి తరుగు, మజూరి లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ నాయకులు సుంకరి రమేష్, ఎమార్పిస్ నాయకులు చింతలపాటి చిన శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.