ఘనంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చల్లా నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు

ఎల్బీనగర్: 15 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థల చైర్మన్ చల్లా నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అభిమానులు కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, ఘనంగా నిర్వహించారు. చల్ల నరసింహారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ శ్రేణులు బొకేలతో శాలువాలతో సత్కరించి తదనంతరం కేక్ కత్తిరించి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అభిమానులు తెలిపారు. చైర్మన్ చల్లా నరసింహారెడ్డి మాట్లాడుతూ నాకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలియజేశారు.