అయిజ ప్రీమియర్ లీగ్ (IPL-9) క్రికెట్ టోర్నమెంట్ 4వ రోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న,
భారతీయ జనతాపార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు ఎస్.రామచంద్ర రెడ్డి బృందం.
జోగులాంబ గద్వాల 6 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి.:-ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 9 క్రికెట్ టోర్నమెంట్ నాల్గవ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ,
ఇలాంటి ఐపీఎల్ మన అయిజలో నిర్వహించడం, అది కూడా 9 సంవత్సరాలు నిరంతంగా కొనసాగించిన యాజమాన్యానికి నవదీప్, మల్లికార్జున్, కరాటే వేణు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం మును ముందు చాలా మంది యువత ఇదే విధంగా ముందుకెళ్లి క్రికెట్ తో పాటు మరిన్ని క్రీడలు నిర్వహించాలని, క్రీడలను నిర్వహించి వారితో ఆడిపించడం వలన శారీరక దృఢత్వం మరియు మానసికంగా దృఢత్వం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఆడే యువత చాలా అద్భుతంగా ఆడుతున్నారని రాష్ట్రస్థాయిలో మరియు జాతీయ స్థాయిలో ఆడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రధాన కార్యదర్శి కంపాటి భగత్ రెడ్డి మరియు ప్రదీప్ స్వామి, జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ యాదవ్, పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, పోతుల రఘు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.