స్పందించక పోతే ప్రతిఘటన పోరాటాలే.సీఐటీయూ

Jan 6, 2025 - 20:56
Jan 6, 2025 - 21:06
 0  8

జోగులాంబ గద్వాల 6 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి.సివిల్ సప్లై హమాలీ కార్మికుల నిరవధిక సమ్మె విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే ప్రతిఘటన పోరాటాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఐటీయూ  జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ.వెంకటస్వామి వివి నరసింహ అన్నారు. రాష్ట్ర కమిటీ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం డిమాండ్లతో కూడిన వినతి  పత్రాన్ని కలెక్టర్ కి అందజేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ......... తెలంగాణ పౌరసరాపరా శాఖలో పనిచేస్తున్న సివిల్ సప్లై హమాలీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం గత ఆరు రోజుల నుండి నిరవధిక సమ్మెలో ఉన్నారని అన్నారు.

కార్మికులలో ఎక్కువగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారే ఉన్నారని వీరంతా రోజు మండల స్టాక్ పాయింట్ల నుండి డీలర్ షాపులకు పాఠశాలల్లో పేద విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం కు అంగన్వాడీ కేంద్రాలకు హాస్టల్ లకు సరఫరా చేస్తూ,ప్రజా పంపిణీ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేస్తున్నారని అన్నారు హమాలీ కార్మికుల వేతన రేట్ల కు సంబంధించి రెండు సంవత్సరాలకు ఒకసారి కార్మిక సంఘాలతో  ప్రభుత్వం అధికార యంత్రాంగం చర్చించి హమాలీ రేట్ల జీవో విడుదల  చేయడం ఆనవాయితీగా కొనసాగుతూ వస్తున్నదని అన్నారు. కానీ గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సంవత్సరము ఒప్పంద ముగిసి మూడు నెలలు గడిచిన ఇప్పటివరకు జీవో విడుదల చేయలేదని దీనివల్ల ఈకాలంలో కార్మికులకు రావలసిన వేతన పెంపు రెట్లు  రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హమాలి  కార్మికుల కుటుంబాలు అర్దాకలి తో  అలమటిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సివిల్ సప్లై హమాలీ కార్మికుల విషయంలో ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పందన రాలేదని ఇలానే కొనసాగితే అన్ని రంగాల కార్మికులను కలుపుకొని ప్రతిఘటన పోరాటాలను రూపకల్పన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు .


కావున ప్రభుత్వం తక్షణ స్పందించి వేతన రేట్లకు  సంబంధించిన జీవోను విడుదల చేసి ఏరియార్స్ తో సహా చెల్లించేందుకు కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించాలని లేని పక్షంలో ఉద్యమ తీవ్రత పెరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి సవారి మద్దిలేటి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ సహాయ కార్యదర్శి శివకృష్ణ వీరెష్ మునిందర్ ఖాజా  రఫీ రాజు హనుమాన్న అశోక్ మల్లన్న నరేష్  జిల్లాలోని వివిధ మండలాల స్టాక్ పాయింట్ల నుండి సివిల్ సప్లై హమాలి కార్మికులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State